పాకిస్తాన్ లో బాంబు పేలుడు సంభవించింది. పెషావర్ లోని ఓ మసీదులో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించినట్టు అధికారులు తెలిపారు.
మరో 50 మందికి పైగా తీవ్రగాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం… ఇద్దరు వ్యక్తులు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై వారు కాల్పులకు దిగారు. ఆ ఘటన తర్వాత కొద్ది సేపటికే మసీదులో బాంబు పేలుడు సంభవించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మేము అత్యవసర స్థితిలో ఉన్నాము. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నాము. పేలుడు ఎలా సంభవించిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నాము. ఇది చూడటానికి ఆత్మహుతి దాడిలాగా కనిపిస్తోంది ” అని పోలీసు అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ తెలిపారు.