దేశంలో జైలు సిబ్బంది పోస్టుల్లో 30 శాతం ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. బీజేపీ ఎంపీ మహేశ్ పోద్దార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్ర పార్లమెంట్ లో బదులిచ్చారు.
దేశంలో అత్యధికంగా జైలు సిబ్బంది పోస్టులు జార్ఖండ్ లో వెకెన్సీ ఉన్నాయన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 2,609 పోస్టులు మంజూరు కాగా అందులో 63% అనగా 1,644 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు.
రెండో స్థానంలో లడఖ్ (62%), ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ (53.3%), బిహార్ (40.7%)లు ఉన్నట్టు ఆయన తెలిపారు. లక్ష దీవులు కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జైళ్లు తక్కువ సిబ్బందితో పనిచేస్తున్నాయని అన్నారు.
డామన్, డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతంలో అవసరానికి మించి సిబ్బంది ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. జైళ్ల కోసం బడ్జెట్ కేటాయింపులు 2020-21లో 2.9 శాతాని(6740.6 కోట్ల నుంచి 6,942.3 కోట్ల)కి తగ్గింది.
ఇక అత్యధిక జైళ్ల శాఖకు బడ్జెట్ కేటాయింపులు అత్యధికంగా యూపీలో 1125.6 కోట్ల కేటాయించగా ఇప్పటి వరకు వాటిలో రూ. 810.4 కోట్లను ఉపయోగించినట్టు ఆయన చెప్పారు.
జైళ్ల అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, వాటి పాలన, నిర్వహణ, సిబ్బంది నియామకం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఆయన వివరించారు.