2023–24 కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 300–400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. జాతీయ రవాణా సంస్థకు కేటాయించాల్సిన స్థూల బడ్జెట్ మద్దతు (GBS) 2022-23 బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1.37 ట్రిలియన్ల సంఖ్యను అధిగమిస్తుందని అధికారి తెలిపారు.
రాబోయే యూనియన్ బడ్జెట్‌లో భారతీయ రైల్వేలకు ఈ బడ్జెట్ ప్రకటించినప్పుడు.. ఇదే అత్యధికంగా ఉంటుందని ఆయన అన్నారు. భారతీయ రైల్వేలలో రద్దీని క్లియర్ చేయడంతో పాటు.. భవిష్యత్తు కోసం దానిని సిద్ధం చేయడం అనే లక్ష్యంతో కొత్త ట్రాక్‌లను నిర్మించడానికి కూడా కేటాయించాల్సిన డబ్బులో కొంత భాగం ఖర్చు అవుతుందని మరో అధికారి తెలిపారు.
సరుకు రవాణా లక్ష్యాలను సాధించడానికి, రాబోయే 25 సంవత్సరాలలో ప్రస్తుత ట్రాక్‌ల పొడవును రెట్టింపు చేయడంతో సహా 100,000 కిలోమీటర్ల ట్రాక్‌లను తప్పనిసరిగా వేయాలని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ఇప్పటికే దాదాపు సంతృప్త స్థాయికి చేరుకున్నాయని అధికారి వివరించారు. “రైల్వే నెట్‌వర్క్‌లోని రద్దీగా ఉండే ప్రాంతాలలో 2030 నాటికి సంవత్సరానికి 3000 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలనే లక్ష్యంతో సరుకు రవాణాను సులభతరం చేయడానికి ఈ విధానం బహుళ ట్రాకింగ్ వైపు వెళ్లాలి” అని ఓ అధికారి తెలిపారు.
అంచనాల ప్రకారం ఈ ఏడాది సరకు రవాణా వృద్ధి 8.5 నుంచి 10 శాతం మధ్య ఉంటుంది. రైల్వే మార్గాలు తక్కువ రద్దీగా మారడంతో, ఇది ఏటా 12-14 శాతానికి పెరుగుతుంది.
2023-23 కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువగా చైర్-కార్ కోచ్‌లు ఉన్న వందే భారత్ రైళ్లలో రాత్రిపూట ప్రయాణాలకు స్లీపర్ క్లాస్ గురించి కూడా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. స్లీపర్ కోచ్ 2024 మొదటి త్రైమాసికం నాటికి పని చేస్తుంది.
భారతీయ రైల్వే కూడా 2025-26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా మార్కెట్‌లకు వందే భారత్ రైళ్లను ఎగుమతి చేసే ప్రధాన సంస్థగా మారాలని చూస్తోందని అధికారులు తెలిపారు.