తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 34,431 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 301 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇక తాజాగా ఈ వైరస్ నుంచి 293 మంది కోలుకున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 2,90,309 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కాటుకు 1,568 మంది బలయ్యారు. ఇక ఇప్పటివరకు 2,84,217 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,524గా ఉంది. ఇందులో 2,459 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 73.12 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.