తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొసాగుతూనే ఉంది. అయితే క్రిస్మస్ కారణంగా పరీక్షలు తగ్గడంతో.. కేసులు కూడా తక్కువగా బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 30,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,391కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా కారణంగా నిన్న ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాలు 1,529కి పెరిగాయి. అటు తాజాగా కరోనా బారి నుంచి 536 మంది కోలుకున్నారు. ఫలితంగా మొత్తం డిశ్చార్జీలు 2,76,244కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 66.86 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.