ఇండియా లో కరోనా తగ్గేదేలే అన్నట్టు విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,17,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఇదే సమయంలో 491 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు.
ఇక గడిచిన 24 గంటల్లో 2,23,990 మంది పూర్తిగా ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051 కి చేరింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 43,697 కర్ణాటకలో 40,499,కేరళలో 34,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.