తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుపోతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 32 ఉండగా..మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో కరోనా కేసుల సంఖ్య 33కు చేరింది. సోమవారం ఒక్కరోజే మరో ఆరు కేసులు కొత్తగా నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఒకరు కోలుకోవడంతో అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మరో 32 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. ట్రీట్మెంట్ తీసుకొంటున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకగాడనే ఉందని… తెలంగాణలో ఇప్ప్పటి వరకు ఎవరు మృతి చెందలేదని తెలిపారు. మరో 97 మందిలో కరోనా లక్షణాలు కనిపించగా..వారి రిపోర్ట్ లు పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించామని…రీపోర్ట్ లు వచ్చాక వివరాలను వెల్లడిస్తామని చెప్పారు మంత్రి ఈటెల. కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోన్న కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది.
అయితే ఇదివరకు కరోనా లక్షణాలు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కనిపించగా..తాజాగా తెలంగాణ వాసులకు కుడా కరోనా సోకుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాదిగ్రస్తులతో మెలగడం వలన వారికీ కుడా కరోనా సోకుతోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వవాలని ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్ప్పదని హెచ్చరించింది.