ఏపీలో గడచిన 24 గంటల్లో 3396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 29 వేల 839 మందికి కరోనా పరీక్షలు చేయగా ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. ఇదే సమయం లో కరోనా నుండి 13005 మంది పూర్తిగా కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 78 వేల 746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2300765 కి పెరిగింది.
అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2207364కి చేరింది. మరోవైపు ఈ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 14655 కి చేరింది.