రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం సరిహద్దుల్లో రణరంగంగా మారింది. చర్చలు అంటూనే ఉక్రెయిన్ ను ఆక్రమించుకకునేందుకు ప్రయత్నం చేస్తోంది రష్యా. కానీ.. రష్యా దాడులకు దీటుగా ప్రతి దాడులు చేస్తూ.. హోరాహోరి పోరాటాన్ని సాగిస్తోంది ఉక్రెయిన్.
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ పారిపోయినట్టు వార్తలు వినిపించాయి. స్పందించిన వ్లాదిమిర్ తాను ఎక్కడికి పోలేదని.. ఇక్కడే ఉన్నానని.. పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తమకు ఆయుధాలు కావాలంటూ ఓ వీడియో విడుదల చేశారు వ్లాదిమిర్.
అయితే.. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు అంత సులువుగా ముందుకు సాగిపోతున్న పరిస్థితి ఏమీ లేనట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యాకు కూడా భారీ నష్టమే జరుగుతోందని వినికిడి ఉంది. ఇప్పటి వరకు సుమారు 3,500 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ ఆర్మీ సోషల్ మీడియాలో వెల్లడించింది.
అంతే కాదు.. మరో 200 మంది రష్యా సైనికుల్ని అందుపులోకి తీసుకున్నామని ఉక్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది. 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్ లను ద్వసం చేసినట్టు తెలిపింది. కానీ.. దీనిపై రష్యా నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అది నిజమే కావచ్చు అని అభిప్రాయ పడుతున్నారు నిపుణులు.