దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న 18,73,757 మందికి పరీక్షలు జరపగా… 36,401 కొత్త కేసులు బయటపడ్డాయి. అలాగే 530 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4,33,039 కి చేరగా.. మొత్తం కేసులు 3.23 కోట్లకు పెరిగాయి.
ఇక రికవరీ రేటు 97.53శాతంగా ఉంది. బుధవారం 39 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 లక్షలుగా ఉంది. మంగళవారంతో పోల్చితే రోజువారీ కేసుల్లో 3.4 శాతం పెరుగుదల కనిపించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 56,36,336 మందికి టీకాలు అందించగా… ఇప్పటిదాకా 56.64 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు.