ఇండియాలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 37875 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,96,718కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో మంది 39,114 కోలుకున్నారు.
ఇక దేశంలో కరోనాతో 369 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,411కి పెరిగింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,22,64,051 మంది కోలుకున్నారు. 3,91,256 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.