దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 22,29,798 మందికి పరీక్షలు జరపగా… 38,667 కేసులు బయటపడ్డాయి. కొత్తగా 478 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4.30లక్షల మార్కును దాటింది. అలాగే మొత్తం కేసులు 3.21 కోట్లకు పెరిగాయి.
ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నిన్న 35 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. అయితే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. కానీ.. గురువారంతో పోల్చితే కేసుల్లో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,13,38,088కి చేరింది.
ఇక యాక్టివ్ కేసులు 3,87,673గా ఉన్నాయి. అలాగే కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 63,80,937 మందికి టీకా అందించారు.