వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు బుధవారం యూకే రక్షణ శాఖ ఓ ట్వీట్ చేసింది.
మరియాపోల్, సుమీలో మానవతా కారిడార్ లకు బలగాలు అంతరాయం కలింగించాయని తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా రోజంతా బాంబుల వర్షం కురిపించిందని ట్వీట్ లో వెల్లడించింది.
ఇలాంటి సమయంలోనూ కొంతమంది పౌరులు నగరాల నుంచి వేరే దేశాలకు మంగళవారం పారిపోగలిగారని పేర్కొంది. యుద్దం కొనసాగుతున్న నగరాల్లో ఆహారం, విద్యుత్, నీటి కొరత కొనసాగుతున్నాయని, పౌరులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది.
మరో వైపు హ్యూమానిటేరియన్ కారిడార్లకు బుధవారం ఉదయం 10 గంటలకు(రష్యా కాలమానం ప్రకారం) అనుమతులు ఇస్తామని రష్యా తెలిపింది. ఈ సమయంలో కాల్పుల విరమణ పాటిస్తామని పేర్కొంది.