ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న ఇండియా జట్టు.. మూడోది కూడా గెలిచి అతిథ్య జట్టుపై విజయాన్ని సాధించాలనుకుంటోంది.
దక్షిణాఫ్రికాను మూడు మ్యాచ్ లలో కూడా ఓడించి క్లీన్ స్వీప్ చేయాలని గట్టి సంకల్పంతో ఉంది.ఈ మ్యాచ్‌కు ముందు కూడా భారత జట్టు మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ బ్యాట్స్‌మెన్‌లకు విశ్రాంతినిచ్చింది. చివరి మ్యాచ్‌లో గెలిచి అతిధ్యమిచ్చిన జట్టును క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది.
ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. కోహ్లీకి విశ్రాంతినిచ్చిన తర్వాత, స్టాండ్‌బైలో కూర్చున్న అయ్యర్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడం దాదాపు ఖాయమైందిఅతను ప్లేయింగ్ XIకి తిరిగి రావడంతో మూడో నంబర్‌లో కూడా బ్యాటింగ్‌లో కనిపిస్తాడు.
రాహుల్‌కు విశ్రాంతి లభించిన తర్వాత ఓపెనింగ్ బాధ్యత రిషబ్ పంత్‌పైనే ఉంటుంది. అయ్యర్ చివరిసారిగా వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ టీ20 ఆడాడు. అప్పటి నుంచి భారత్ తరపున ఏ మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 సిరీస్ తర్వాత, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కూడా ఉంది. ఈ సిరీస్‌లో అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు.
ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 237 పరుగులకు ఆలౌటైంది.
అయితే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కేవలం 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా తరపున డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ చేస్తూ 47 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేశాడు.