ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కేజిఎఫ్. ఎటు వంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అలాగే నిర్మాతలకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి సరిగ్గా 3ఏళ్ళు. ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. కేజిఎఫ్1 స్టార్టింగ్ నుంచి కేజిఎఫ్ 2 షూటింగ్ వరకు అన్ని ఆ వీడియో లో చూపించారు.
ఇప్పటికీ మన చుట్టూ ఈలలు, అరుపులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమ చిత్రంగా ఆదరించిన అభిమానులందరికీ రుణపడి ఉంటాం. ఈ అభిమానమే కేజిఎఫ్- చాప్టర్ 2ను తెరకెక్కించడానికి ఇంధనంగా మారింది అంటూ చిత్రబృందం పేర్కొంది. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ని ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.