సిక్కింలో భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్‌లో ఈ రోజు తెల్లవారు జామున భూమి కంపించింది. యుక్సోమ్‌కు వాయువ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే ఇండ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం అసోంలోనూ భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరగలేదని అధికారులు చెప్పారు. మరో వైపు అసోంలో నిన్న భూకంపం సంభించింది. నాగావ్ ప్రాంతంలో భూమి కంపించింది.
రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.18 గంటలకు భూకంపం సంభవించింది. భూమిలో 10 కిలోమీటర్లలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు వెల్లడించారు. భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్ లలోనూ భూకంపం సంభవించిందన్నారు.