సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. లేనిపోని విషయాలకు ప్రజల్లో ఒక రకమైన భ్రమలను కల్పించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను డబ్బుల పేరుతో ఆశ పెడుతూ కొంతమంది చేస్తున్న వ్యవహారాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారింది. పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరికలు చేస్తున్నా ప్రజలకు ఎన్ని విధాలుగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నా సరే కొంత మందిలో మార్పు రావడంలేదు.
తాజాగా రిజర్వు బ్యాంకు నుంచి వచ్చిన ఒక మెసేజ్ అంటూ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ గా మారింది. 12,500 చెల్లిస్తే 4.62 కోట్లు సంపాదించొచ్చు అని పేర్కొంటూ ఇటీవల చాలా మంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పి ఐ బి టీం నిజానిజాలు కనుగొంది. ఆర్బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని మోసగాళ్లు ప్రజలను డబ్బు పేరుతో మోసగించడానికి ప్రభుత్వ సంస్థ పేరుతో ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు.
Advertisements
నకిలీ వెబ్ సైట్లో మోసగాళ్ళు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న శక్తి కాంతా దాస్ ఫోటోలు కూడా ఉపయోగించడం విశేషం. ఇటువంటి వాటిని అసలేమాత్రం కూడా నమ్మొద్దని అసలు ఇటువంటి ప్రకటనలు వచ్చే అవకాశమే లేదని కాబట్టి ప్రజలు అనవసరంగా నమ్మి మోసపోవద్దు అని పలువురు సూచిస్తున్నారు. ఈ ట్వీట్ వైరల్ చేసిన వ్యక్తులు కొంతమంది తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నట్టు గా చెప్పారు.