జమ్ము కశ్మీర్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుల్వామా జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బస్సు దక్షిణ కశ్మీర్ జిల్లాలోని బర్సో ప్రాంతంలో శ్రీ నగర్- జమ్ము జాతీయ రహదారిపైకి చేరుకోగానే బస్సు బోల్తా కొట్టినట్టు అధికారులు తెలిపారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మృతులు నలుగురు బిహార్ కు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. గాయపడిన 23 మందిని సమీపంలో వేర్వేరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మద్య కాల్పులు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల వున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ క్రమంలో భద్రతా దళాలను గమనించి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు. కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.