గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు. అచ్చంపేట మండలం మాదిపాడులోని శ్వేత శృంగేరి వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సహా ఓ ఉపాధ్యాయుడు సమీపంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు ఐదురుగు మృతి చెందారు.
మృతులలో ఒక విద్యార్థి మధ్యప్రదేశ్‌కు చెందిన వాడు కాగా.. ముగ్గురు ఉత్తరప్రదేశ్ కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అటు, మృతి చెందిన టీచర్ నరసరావుపేట వ్యక్తిగా చెబుతున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.