నాలుగేళ్ళు నరకం చూపారు

బ్రిటన్ లోని టెల్ ఫోర్డ్ టౌన్ లో పాకిస్తానీ ముఠాల చేతిలో నరకం అనుభవించిన ఓ బాధితురాలు తన దారుణ అనుభవాలను ” గుడ్ మార్నింగ్ బ్రిటన్ ” అనే టీవీ షో లో వివరించింది. హోలీ (అసలు పేరు కాదు ) అనే ఈమె తన ముఖం చూపకుండా నిర్వాహకులకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ” నా 14 ఏళ్ళవయస్సులో నా బాయ్ ఫ్రెండ్సే నన్ను ఈ గ్యాంగులకు అమ్మేశారు.

నాకు 18 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు నాపై ఎన్నోసార్లు అత్యాచారాలు జరిగాయి ” అని ఈ బాధితురాలు తెలిపింది. 11 ఏళ్ళ మైనర్లను కూడా రేప్ చేసి డ్రగ్స్ కు బానిసలుగా మార్చి హతమార్చిన దారుణ ఘటనలున్నాయని ఆమె పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని, నీ కుటుంబాన్ని సజీవ దహనం చేస్తామని బెదిరించేవారని హోలీ వెల్లడించింది. కొన్ని సార్లు కారులో తనను క్రిమినల్స్ తీసుకువెళ్తుండగా పోలీసులు కారును ఆపారని, అయితే వారిని ఏమీ ప్రశ్నించకుండానే జారుకున్నారని ఆమె చెప్పింది. అతికష్టం మీద ఆ కిరాతకుల బారి నుంచి నన్ను నేను కాపాడుకుని బయటపడ్డాను అని పేర్కొంది. టెల్ ఫోర్డ్ లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ లో ముబారక్ అలీ అనే వ్యక్తి 13 ఏళ్ళ అమ్మాయిని ఇతర బ్రోకర్లకు అమ్మేశాడట.

ఇలాంటి నేరాలకే పాల్పడిన ఇతని సోదరుడు అహదల్ అలీని, అజహర్ అలీ మహమూద్ అనే మరొకడ్ని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పరచగా వీరికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే వీరి ముఠాలోని అనేకమంది తప్పించుకుని బయట స్వేచ్చగా తిరుగుతున్నారట. సుమారు వెయ్యిమంది అమాయక యువతులు, మైనర్లు ఈ రాక్షస మూకల చేతిలో విలవిలలాడుతున్నారని తెలుస్తోంది.

https://youtu.be/BUkuaIVAYnE