కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా సమయంలో 40 లక్షల మంది భారతీయులు ప్రాణాలను కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అందువల్ల కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్యను బహిర్గత పరచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఇండియా నిలిపివేస్తోందన్న న్యూయార్క్ టైమ్స్ నివేదిక స్క్రీన్‌షాట్‌ను ఆయన ట్వీట్ చేశారు.
మోడీజీ .. ఆయన నిజాలు మాట్లాడరు. మరొకరిని మాట్లాడనియ్వరు. ఆక్సిజన్ కొరతతో దేశంలో ఎవరూ చనిపోలేదని ఆయన ఇంకా అబద్దాలు ఆడుతున్నారని ట్వీట్ లో రాహుల్ పేర్కొన్నారు.
‘ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కొవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐదు లక్షలు కాదు, 40 లక్షల మంది భారతీయులు మరణించారు’ అని అన్నారు.
మీ బాధ్యతను ఇప్పుడు మీరు నెరవేర్చండి మోడీ జీ. మృతుల కుటుంబాలకు ఒక్కంటికి రూ. నాలుగు లక్షల పరిహారం అందజేయండని ఆయన డిమాండ్ చేశారు.