సినీతారలు కొంచెం లేట్ అయినా సరే వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు..తమ కలల యువరాణి ఒకరి సొంతం అయిపోతుంటే నిట్టూర్చే అభిమానులు ఉంటారు..వారి వివాహాలు ఎంతవరకు నిలబడతాయనేది ప్రస్తుతానికి అప్రస్తుతం.. కానీ తమ సినిమాలతో అలరించిన కొందరు నటీమణులు యాభైకి దగ్గరపడినా ఇంకా వివాహం చేసుకోకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది..అటువంటి కొందరు హీరోయిన్స్ గురించి చూద్దాం..
టబు:
నిన్నే పెళ్లాడతా ఫేమ్ టబు వయసు 48. ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు.! టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జునతో ప్రేమ వ్యవహారమే కారణమని ఇండస్ట్రీ టాక్.!
నగ్మా:
మొదట క్రికెటర్ గంగూలితో తర్వాత నటుడు శరత్ కుమార్ తో లవ్ స్టోరి నడిచింది! బట్ పెళ్లి మాత్రం కాలేదు!
శోభన:
భరత నాట్యకళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటి శోభన ! ఇప్పటివరకు వివాహం చేసుకోని శోభన ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటుంది.
సితార:
పదహారేళ్లకి నటనని ప్రారంభించిన సితార .సహనటుడు మురళిని లవ్ చేసింది! తర్వాత ఒంటరిగానే ఉండిపోయింది. అప్పుడు హీరోయిన్స్ గా అలరించిన సితార ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది!
కత్రినా కైఫ్ :
40 కి దగ్గర్లో పడ్డ …ఈ బాలీవుడ్ భామ కూడా ఇంత వరకు పెళ్లి ప్రయత్నాలేవీ చేయలేదు. సల్మాన్ ఖాన్ తో ప్రేమ , డేటింగ్…ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో వీళ్ల రిలేషన్ బ్రేక్ అప్ అయ్యింది.