ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,603 కరోనాపాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇదే సమయంలో 415 మంది మృతి చెందారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా ఈ మహమ్మారి నుంచి 8,190 మంది కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 99,974 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసులలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 34053856కి పెరిగింది. అలాగే మృతుల సంఖ్య 470530కి పెరిగింది. ఇక ఇప్పటివరకు దేశంలో 1,26,53,44,975మందికి కరోనా వాక్సిన్ వేశారు.