ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,198 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే అదే సమయంలో 9,317 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఐదు మంది మృతి చెందారు.
ఇక ప్రస్తుతం 88,364 యాక్టీవ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కి పెరిగింది. రికవరీ కేసుల సంఖ్య 21,94,359కి పెరిగింది. అలాగే మరణాల సంఖ్య 14,646 కి చేరింది.
కొత్తగా నమోదు అయిన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 555, విజయనగరంలో అత్యల్పంగా 54 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో కరోనా కేసుల్లో రెండు లక్షల మార్కును దాటిన జిల్లాగా గుంటూరు నిలిచింది.