గడచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా 428 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తాజాగా నమోదైన కేసులు తో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 8,83,876 కరోనా పాజిటివ్ కేసులకు చేరుకుంది. మరోవైపు గడచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7112 మంది కరోనా కారణంగా చనిపోయారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2896 యాక్టీవ్ కేసులున్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ మహమ్మారిని జయించి 8,73,855 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. కొత్తగా మరణించిన వారిలో కృష్ణ ప్రకాశం విశాఖ జిల్లాల్లో ఒకొక్కరు చొప్పున మృతిచెందారు.