అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర 42 రోజుకు చేరింది. ఈ రోజు శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకూ కొనసాగింది. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అమరావతి రైతులకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. పాదయాత్ర చేస్తున్న ప్రాంతలలో స్థానిక ప్రజలు హరతులు ఇస్తూ.. పూల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని ఉండాలని.. అది కూడా అమరావతి మాత్రమే కావాలని అన్నారు.
తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతులు చేపట్టనున్న బహిరంగ సభకు పోలీసులు అటంకాలు కల్పించడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర పై తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు తెదేపా, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.