ఆంద్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 43 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1930కు చేరుకుంది. తాజాగా నమోదు అయిన కేసుల్లో అనంతపురం 3, చిత్తూరు 11, గుంటూరు2, కృష్ణ 16, కర్నూల్ 6 విశాఖలో 5 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 553 కేసులు నమోదు కాగా, గుంటూరు లో 376, కృష్ణ లో 338 కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ కాగా 999 మంది చికిత్స పొందుతున్నారు. మరో వైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో 3 మృతి చెందారు. అందులో కృష్ణలో ఇద్దరు కాగా, కర్నూల్ చెందివారు ఒకరు మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 44 కు చేరుకుంది.