పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధిన బారినపడుతున్న వారి సంఖ్య అంతకంత పెరుగుతోంది. ఇవాళ మరికొందరు ఆస్పత్రిలో చేరడంతో మొత్తం బాధితుల సంఖ్య 448కు పెరిగింది. అయినప్పటికీ ప్రజల అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియడం లేదు. మరోవైపు ఇప్పటికే కొంత మంది డిశ్చార్జ్ కాగా.. మరికొందరి పరిస్థితి మాత్రం సీరియస్‌గా మారింది. దీంతో దాదాపు 10 మందికిపైగా బాధితులని మెరుగైన వైద్యం కోసం విజయవాడ పంపించారు.
బాధితులకు ఇప్పటికే అన్ని రకాలు పరీక్షలు నిర్వహించారు. కాగా వైరల్ టెస్టులన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. నీటిలో మెటల్ టెస్టులు కూడా చేయగా.. అవి కూడా నెగెటివ్ అనే తేలాయి. నీటిని పరిశోధించడానికి శాంపిళ్లను సీసీఎంబీకి కూడా పంపారు. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో, ఐఐఎంఆర్, ఎయిమ్స్‌కు చెందిన బృందాలు కూడా ఏలూరుకు రానున్నాయి.