ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తాజా గణాంకాల ప్రకారం నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది. అలాగే ఇప్పటివరకు 20,61,039 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు ఇప్పటివరకు మొత్తం 14,508 మంది కరోనా తో మృతి చెందగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,313 కి పెరిగింది.
ఇక గడిచిన 24 గంటల్లో 418 మంది కరోనా కోలుకున్నారు. అదే సమయంలో ఒకరు కరోనా తో మృతి చెందారు.