ఇండియాలో మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,765 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో మరోవైపు కరోనా కారణంగా 477 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గడిచిన 24 గంటల్లో 8,548 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 99,763 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,40,37,054కి చేరింది. మరోవైపు మొత్తం మృతుల సంఖ్య 4,69,724కి పెరిగింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మొత్తం 1,24,96,19,515 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.