ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తుంది. తాజాగా మరో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొట్ట 9284 మందిని పరీక్షించగా 48 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2137 కు చేరుకుంది. తాజాగా నమోదు అయిన కేసుల్లో అనంతపురం 3, చిత్తూరు 11, తూర్పుగోదావరి 4, గుంటూరు 12, కృష్ణ 3, కర్నూల్ లో 7 కేసులు నమోదు అయ్యాయి.
మొత్తం రాష్ట్రంలో అత్యధికంగా కర్నూల్ లో 591 కేసులు నమోదు కాగా, ఆ తరువాత గుంటూరులో 399 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 86 మంది డిశ్చార్జ్ కాగా అందులో గుంటూరు 27, కృష్ణ 25, కర్నూల్ 13, కడప 10, తూర్పుగోదావరి 4, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు డిశ్చార్జ్ అయ్యారు.