టీమ్ ఇండియాను ఈ ఆస్ట్రేలియా టూర్ లో గాయాలు భయపెడుతున్నాయి. డిసైడింగ్ టెస్ట్ అయిన 4 వ టెస్ట్ లో ప్రధాన బౌలర్లు ఎవ్వరూ లేకుండానే టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది! బ్యాటింగ్ లైనప్ లో కూడా గాయల బెడద ఎక్కువగానే ఉంది.
ఇప్పటి వరకు ఎవరెవరు గాయపడ్డారు?
భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రిషబ్‌పంత్ లు గాయపడ్డారు.
ఇందులో రోహిత్ శర్మ ఫిట్‌గా ఉండగా… రిషబ్ పంత్, అశ్విన్ పుల్ ఫిట్‌నెస్‌తో లేరు. వీరు ఆడేది లేనిది చెప్పలేము… మిగిలిన వాళ్లు ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నారు.
ఎవరు మిస్ అయితే ఎవరు?
- బుమ్రా ఉదర కండరాలు పట్టేయడంతో నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. దీంతో సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.
- ఆశ్విన్ ఔట్ అయితే….కుల్దీప్ ను దించే ఆలోచన చేస్తారు.
- హనుమ విహారి స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగొచ్చు.
- ఇక ఫేస్ విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటే మాత్రం జడేజా స్థానంలో నటరాజన్ ను రంగంలోకి దిగొచ్చు.