యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మీరట్ లోని దౌరాలలో కోల్ట్ స్టోరేజి యూనిట్ లో పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్కిల్ ఆఫీసర్ ఆశీష్ శర్మ మాట్లాడుతూ…. కోల్డ్ స్టోరేజీలో పై కప్పు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ రోజు ఒక్క సారిగా పై కప్పు కూలిపోయినట్టు చెప్పారు. ఆ సమయంలో నిర్మాణ పనివారు అక్కడే ఉన్నట్టు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.
ఇప్పటి వరకు 26 మందిని శిథిలాల కింది నుంచి రక్షించినట్టు ఆయన అన్నారు. అయితే పై కప్పు కూలడానికి గల కారణాలపై ఇంకా స్పష్ట రాలేదన్నారు. మృతుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.