యూపీ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ జిల్లాలో దారుణమైన సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయి. ఖరాయిపుర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.
మృతుల్లో రామ్ కుమార్ యాదవ్(52), ఆయన భార్య కుసుమ్ దేవి(52), కూతురు మనీషా(25), కోడలు సవిత(27), మనవరాలు మీనాక్షి(2)లు ఉన్నారు. ఈ ఘటనలో అయిదేళ్ల మనవరాలు సాక్షి ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే, రామ్ యాదవ్ కుమారుడు సునీల్(30) మర్డర్ జరిగిన సమయంలో ఇంట్లో లేడు. ఈ సంఘటన ఆ ప్రాంత వాసుల్లో తీవ్ర కలకలం రేపింది.
హత్య అనంతరం దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. మంటలను గమనించి స్థానికులు రామ్ కుమార్ యాదవ్ ఇంటి వద్దకు వెళ్లి చూడగా.. ఐదురుగురు హత్య చేయబడి ఉన్నారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. మృతిచెందిన వారి శరీరాలపై మరకలు ఉన్నాయని, అందరి తలపై గట్టిగా కొట్టినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు పంపారు. పోలీసులు నేరస్థులను పట్టుకునేందుకు ఏడు బృందాలుగా అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్రైమ్ సీన్‌కు వచ్చారు.
Advertisements
యాదవ్ ఇంట్లో తొలుత మంటల చెలరేగినట్లు స్థానికులు చెప్పారని జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఖత్రి తెలిపారు. హత్యలకు గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే, గత వారం నవాబ్ గంజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల్ని దారుణంగా హత్య చేశారు.