దేశంలోని ఐదు ప్రాంతాలకు తాజాగా రామ్ సర్ అవాసాలుగా యునెస్కో గుర్తించింది. దీంతో దేశంలోని రామ్ సర్ అవాసాల సంఖ్య 49 నుంచి 54కు చేరింది. ఈమేరకు విషయాన్ని కేంద్రం వెల్లడించింది.
కరికిలి పక్షుల సంరక్షణ కేంద్రం, పల్లి కరణాయ్ మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్, తమిళనాడులోని పించవరం మాంగ్రూవ్ అడవులు, మిజోరాంలోని పాలా చిత్తడి నేలలు, మధ్యప్రదేశ్ లోని సఖ్య సాగర్ కు రామ్ సార్ అవాస గుర్తింపు వచ్చినట్టు పేర్కొంది.
దేశంలోని మరో ఐదు చిత్తడి నేలలకు రామ్ సర్ అవాసాలుగా అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల ఆనందంగా ఉందని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి భూపేందర్ యాదవ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో వెల్లడించారు.
ఆసియాలోనే అత్యధిక రామ్ సర్ చిత్తడి నేలలు భారత్ లో ఉన్నాయి. తాజాగా ఈ సంఖ్య 54కు పెరిగిందని, దీంతో విస్తీర్ణం 1,098, 518 హెక్టార్లకు పెరిగినట్టు పేర్కొంది.