పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చి పోయారు. పోలీసులే లక్ష్యంగా కాల్పులకు దిగారు. సాయుధులైన 8 మంది పాలికిస్తాన్ తాలిబాన్ మిలిటెంట్లు కరాచీ పోలీస్ స్టేషన్ పై కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు.
దీంతో పాటు ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు పౌరులు మృతి చెందారు. 18 మందికి తీవ్రగాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు పోలీసుల దుస్తుల్లో పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారని డీఐజీ ఇర్ఫాన్ పేర్కొన్నారు. మొదట ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ దాడి చేశారని పేర్కొన్నారు.
అనంతరం పోలీసులపై విచక్షణ కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగగా ముగ్గురు ఉగ్రవాదులు తమకు తాము కాల్చుకుని మరణించారన్నారు. మరోవైపు పాక్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన క్రికెటర్లు కరాచీ పోలీసు కార్యాలయానికి దగ్గరలోనే బస చేస్తున్నట్టు చెప్పారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచినట్టు ఆయన వివరించారు. మరోవైపు అమెరికాలోని మిస్సిస్సిప్పీలోని టేట్ కౌంటీలో దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితున్న అదుపులోకి తీసుకున్నారు.