ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. ఈ నెలలో ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. జూన్ 3 నుంచి 24 వరకు బుధుడు, గురుడు, శుక్రుడు, శని, వీనస్ గ్రహాలు ఒకే వరుసలో రానున్నాయి.
ఖగోళ అద్భుత దృశ్యాన్ని ఎలాంటి టెలిస్కోప్ సహాయం లేకుండా నేరుగా కంటితో చూడవచ్చును. సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు.
చాలా సార్లు మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తుంటాయి. ఇలా ఐదు గ్రహాలు ఒకే వరుసలో రావడం అరుదైన విషయం. ఇలాంటి అద్భుతం ప్రతి 18 ఏండ్లకు ఒక సారి వస్తుంది.
గతంలో 2004లో ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో వచ్చాయి. అయితే ఈ సారి ఐదు గ్రహాల్లో శుక్ర, అంగారక గ్రహాల మధ్య చంద్రుడు అతిథిలాగా వచ్చి కనువిందు చేయనున్నాడు.