-2 వేలు దాటిన కేసుల సంఖ్య
– గతేడాది అక్టోబర్ తర్వాత ఇదే అధికం
-ఐదు రాష్ట్రాల నుంచే ఎక్కువ కేసులు
-మహారాష్ట్రలో మూడు రోజుల్లో కేసుల సంఖ్య డబుల్
-దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలోనే
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 28న దేశంలో 2208 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజాగా 2151 కరోనా కేసులు నమోదైనట్టు కేంద ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ కేసుల సంఖ్య 4,47,09,676కు చేరుకుంది. కరోనా భారిన పడిన తాజాగా ఐదుగురు మరణించారు. వారిలో మహారాష్ట్ర ముగ్గురు, కేరళ నుంచి ముగ్గురు, కర్ణాటకలో ఒకరు మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,848కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903 చేరుకుంది. ఐదు రాష్ట్రాల నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు చెప్పింది. ఈ క్రమంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలో ఈ రోజు 450 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 81,42,509కు చేరుకుంది. సోమవారం నుంచి చూస్తే కేసుల సంఖ్య రెండు రెట్లు పెరిగాయి. సోమవారం 205 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,48,438 కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 214 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 671 యాక్టివ్ కేసులు ఉన్నాయని,ఇన్ ఫెక్షన్ రేటు 11.88 శాతంగా ఉంది. కేరళలో సోమవారం 191 కొవిడ్ కేసులు రిజిష్టర్ అయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,662గా వుంది. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 135 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.యాక్టివ్ కేసుల సంఖ్య 800 దాటింది. కొవిడ్ భారిన పడి ఒకరు మరణించారు. తమిళనాడులో 105 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో చెన్నై 31, కోయంబత్తూర్ 18, చెంగల్పట్టు 11 కేసులు ఉన్నాయి.