చాలా మంది ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఫ్యూచర్ ని ఎలా మెరుగుపరుచుకోవాలి తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. డబ్బులు ఎలా పొదుపు చేయాలి? ఎలా మిగుల్చుకోవాలి ? అనే ఆలోచనలతో సతమతం అవుతుంటారు. అయితే ముందుగా తక్కువ డబ్బు ఆదా చేయడం నుంచి మొదలుపెడితే నెమ్మదిగా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవ్వచ్చు. అప్పుడే భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫ్యూచర్లో బాగుండడానికి 5 చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. టర్మ్ ఇన్సూరెన్స్
కరోనా ఒక జీవిత పాఠం నేర్పింది అని చెప్పవచ్చు. ఇలాంటి మహమ్మారి నుంచి కాపాడు కోవాలంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే వెంటనే జీవిత భీమాను చేయించుకోండి .
2. మెడికల్ ఇన్సూరెన్స్
ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వచ్చి పడుతుందని ఎవరూ ఊహించలేరు. పెద్ద పెద్ద జబ్బులు చెప్పి రావు. ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ అవుతుందా? నార్మల్ గా తిరిగి వస్తామా? అనేది మన చేతుల్లో ఉండదు. కాబట్టి మనల్ని, మనంకుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి మెడికల్ ఇన్సూరెన్స్ ఎంతో అవసరం.
3. పీఎఫ్ అకౌంట్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ను కచ్చితంగా ఓపెన్ చేయండి. దీని వల్ల 7.1 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి సంవత్సరం చివర్లో ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుంది. పీఎఫ్ ఖాతా లో రూ. 500 నుంచి 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇది 15 ఏళ్ల తిరిగేలోపు రెట్టింపు అవుతుంది.
4. సొంత ఇల్లు
అద్దెకు తీసుకుని ఉండడం కన్నా పెద్ద సమస్య ఇంకోటి ఉండనే ఉండదు. చిన్నదైనా సరే సొంత ఇల్లు కొనడం మంచి పని.
5. పెట్టుబడి
ఏదో ఒక ఒక పెట్టుబడి పెట్టండి. అది చిన్నదైనా పెద్దదైనా. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడి మార్గాలు ఎన్నో ఉన్నాయి.