సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తొలి సింగిల్ కళావతి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. విడుదలైనప్పటి నుండి ట్రెండింగ్ లోనే ఉంది. అంతే కాదు ఈ సాంగ్ అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సింగిల్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది.
థమన్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ వాయిస్ అన్ని కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్.
ఫస్ట్ సింగిల్ మంచి హిట్ కావటం తో ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుంది.
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.