శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు శివసేనతో పాటు, స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 50 మంది మద్దతు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఫ్లోర్ టెస్టులో తాము పాస్ అవుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కామాక్య దేవీ ఆలయాన్ని ఆయన బుధవారం రెండో సారి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..
తమకు 50 మంది శివసేన, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిపారు. శివసేనలో మూడింట రెండు వంతుల శాసన సభ్యులు తమకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. అందువల్ల ఫ్లోర్ టెస్ట్ గురించి తాము బయపడటం లేదన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఖ్యా బలం, మెజారిటీ ముఖ్యమైందని తెలిపారు. అందువల్ల తమను ఎవరూ ఆపలేరన్నారు. ఫ్లోర్ టెస్ట్ తర్వాత తమ వర్గం ఎమ్మెల్యేలతో చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు.