న్యూజిలాండ్‌లో పెద్ద ఎత్తున తిమింగలాలు మృతి చెందాయి. దేశంలో సుమారు 500 తిమింగలాలు (పైలట్ వేల్స్)
మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
చాథమ్ దీవుల వద్ద పైలెట్స్ వేల్స్ మరణించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో
చాథమ్ దీవుల్లో 250 తిమింగలాలు , పిట్ దీవిలో మరో 240 తిమింగలాలు మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఈ దీవులు న్యూజిలాండ్ కు చాలా దూరంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అందు వల్ల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం కష్టంగా మారిందని వెల్లడించింది.
ఆ దీవుల్లో భారీగా షార్క్‌లు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆ షార్క్ లు మనుషుల, వేల్స్‌పై దాడి చేసే అవకాశం ఉందని చెప్పింది. అందుకే రెస్క్యూ ఆపరేషన్ అసాధ్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు.