హర్యానాలోని రాఖీగర్హి గ్రామంలో 5,000 ఏండ్ల నాటి సింధు లోయ నాగరికతకు చెందిన ఆభరణాల తయారీ పరిశ్రమ అవశేషాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కనుగొంది.
రాఖీగర్హి ప్రాంతంలో ఒకప్పుడు అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఒక ప్రణాళిక బద్దమైన నగరం ఉండేదని ఇప్పటి వరకు చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ నగరంలో విశాలమైన వీధులు, పక్కా గోడలు, బహుళ అంతస్తుల గృహాలతో పాటు అద్బుతమైన పట్టణ ప్రణాళికకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్టు అధికారులు చెప్పారు.
తాజాగా ఆభరణాల పరిశ్రమ అవశేషాలను బట్టి చూస్తే ఇక్కడ నగలను తయారు చేసేవారని, నగల వ్యాపారం కూడా జరిగేదని గుర్తించినట్టు అధికారులు వివరించారు.
తవ్వకాల సమయంలో ఇద్దరు మహిళల అస్థిపంజరాలు దొరికినట్టు చెప్పారు. ఆ అస్థిపంజరాల మెడలో ఆభరణాలు కనిపించాయని పేర్కొన్నారు. అస్థి పంజరాలతో పాటు వారు ఉపయోగించిన పాత్రలు కూడా లభించాయన్నారు.