యూపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా నేర చరితను కలిగి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం..
కొత్త ఎమ్మెల్యేల్లో 50 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 403 మంది ఎమ్మెల్యేల్లో 205 మందిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి.
గెలిచిన ఎమ్మెల్యేల్లో 158 లేదా 39శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ నేరాలు నమోదయ్యాయి. ఐదుగురిపై హత్య కేసులు, 29 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.
వివిధ పార్టీల వారిగా చూస్తే .. బీజేపీలో 255లో 90(35 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు నివేదిక తెలిపింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి 111లో 48(43శాతం), ఆర్ఎల్ డీ నుంచి 8లో 5 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది.