ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 510 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,025కి చేరింది.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు రాష్ట్రంలో 7,052 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 665 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,62,895కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,078 యాక్టివ్ కేసులున్నాయి.