తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 52 వేల కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 79 వేల 135కి చేరింది. ఇక కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాలు 1,502కి పెరిగాయి.
కరోనాబారి నుంచి తాజాగా 622 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీలు 2 లక్షల 70 వేల 450కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 7 వేల 183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 5,041 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 62.57 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.