ఆయన ఓ 60 ఏండ్ల వృద్దుడు.. కాదు కాదు యువకుడు. ఒకటి కాదు రెండు ఏకంగా 14 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు. చివరికి 14 వభార్యకు అనుమానం వచ్చి కేసు పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…
ఒడిశాలోని కేంద్రపరా జిల్లా పట్కురా ఠాణా పరిధిలోని గ్రామానికి చెందిన బిబు ప్రకాశ్ స్వెయిన్ అలియాస్ రమేశ్ స్వెయిన్ కు ప్రస్తుతం 60 ఏండ్లు. మధ్య వయస్సులోని ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసుకునేవాడు.
దానికి కోసం మ్యాట్రిమోనిని వేదికగా ఎంచుకున్నారు. అందుకోసం తనను తాను డాక్టర్ గా పేర్కొంటూ ఓ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. మధ్య వయస్సులో ఉన్న అడ్వకేట్లు, డాక్టర్లు, బాగా చదువుకున్న వారిని తన మాటల ద్వారా ఆకర్షించి వారిని వివాహం చేసుకునే వాడు. అనంతరం వారి దగ్గర నుంచి డబ్బు తీసుకుని పారిపోయేవాడు.
ఈ క్రమంలో 2018లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను వివాహం చేశాడు. ఆమెతో కలిసి భువనేశ్వర్ లో కాపురం పెట్టాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.