2021 కరోనా మహమ్మారి సమయంలో కూడా తమ పరిశోధనలకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఈ భూమి పై సుమారు 552 కొత్త జీవులను కనిపెట్టామని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు తెలిపారు. రోలీ-పాలీ మోనోక్రోమటిక్ బీటిల్, ఫ్యాన్-గొంతు బల్లి, రైస్ మౌస్, మొసలి ముఖంలా ఉండే డైనోసార్‌లు ఇలా చాలా కనిపెట్టామని అన్నారు. ఇవి తమ అధ్యయనాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
అంతరించిపోయాయని అభిప్రాయపడిన స్పినోసౌరిడ్‌లు కనిపెట్టామని అన్నారు. రెండు మాంసాహార డైనోసార్లు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఐల్ ఆఫ్ వైట్‌లో గుర్తించామని చెప్పారు. ఈ డైనో సార్లకు “హెల్ హెరాన్” మరియు “రివర్‌బ్యాంక్ హంటర్” అని పేర్లు పెట్టినట్టు చెప్పారు. కోడి పరిమాణంలో ఉన్న మరో డైనోసార్ జాతికి “చీఫ్ డ్రాగన్” అని నామకరణం చేసినట్టు తెలిపారు. 150 సంవత్సరాలుగా డైనోసార్లపై పరిశోధనలు జరుగుతున్నాయని.. వీటికి సంబంధించి పెద్ద మొత్తంలో సమాచారం కూడా అందుబాటులో ఉందని మ్యూజియంలోని సీనియర్ పరిశోధకురాలు సుసన్నా మైడ్‌మెంట్ అన్నారు. కానీ.. ఈ ఏడాది డైనోసార్ల గురించి కనిపెట్టిన కొత్త సమాచారంతో ఈ జీవులపై మరింత అవగాహన కల్పించడానికి అనువుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనాతో తమ పరిశోదనలకు పరిమితులు విధించినా.. ఈ ఏడాది గణనీయమైన ఆవిస్కరణలు చేసి.. 522 జీవులను కనిపెట్టడం ఆనందంగా ఉందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో సగానికి పైగా జీవులు క్రస్టేసియన్ల జాతికి చెందిన కోపెపాడ్స్ అని అన్నారు. ఇవి సుమారు 290కి పైగా ఉంటాయని అన్నారు. ఇవి చూడటానికి రొయ్యిల ఆకారంలో ఉంటాయని.. చేపలు లాంటి పెద్ద జీవులకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయని తెలిపారు.