తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 47,991మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 551 మందికి పాజిటివ్ అని తేలింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 80 వేల195కు చేరింది. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న ఒక్కరు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాలు 1506కు పెరిగాయి.
కరోనా బారి నుంచి తాజాగా 682 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2 లక్షల 71 వేల 649కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,040 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,955 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 63.54 లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.