ఏపీని కరోనా వైరస్ వణికిస్తుంది. మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు అనిపించినా… మరోసారి 50కి పైగా కొత్త కేసులు వచ్చాయి. ఏపీలో గత 24గంటల్లో 57 కొత్త కేసులు రావటంతో అధికారుల్లో మరోసారి ఆందోళన మొదలైంది.
కొత్తగా వచ్చిన కేసులను జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు, నెల్లూరులో 14 కేసులు వచ్చాయి. కర్నూలు 8, అనంతపురం 4, కృష్ణాలో 9, తూ.గో 1, విజయనగరం 3, కడప, విశాఖలలో 2 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2157కు చేరాయి. మరణాల సంఖ్య 48కి చేరింది.